telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య అదిరిపోయిన ‘ఆహా’ ప్రోమో విడుద‌ల‌..

తెలుగువారి ఫేవరెట్ ప్రముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ‘ఆహా’లో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు మొట్టమొదటిసారిగా హోస్ట్‌గా నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యవహరించనున్నారు . ఈ కార్యక్రమానికి ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అని నామకరణం చేశారు. ఈ ఓటీటీ ఒరిజినల్ కు సంబంధించిన లాంచింగ్ వేడుక దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. కలుద్దాం… హ..హ…హ ఆహాలో అన్నప్రోమోలో బాలకృష్ణ డైలాగ్ చెప్పారు.

Balakrishna's Talk Show Unstoppable from November 4th on Aha - Telegraph Star

ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రశాంత్ వర్మ, బీవీఎస్ రవి ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న తొలి ఎపిసోడ్​ ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్​కు మోహన్​బాబు రానున్నారని ప్రచారం సాగుతోంది.

ఈ షో పరిచయ వేడుకలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ..తెలుగు ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారని.. అందుకే ఈసారి వారి ముందకు వ్యాఖ్యతగా రాబోతున్నట్లు తెలిపారు. సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ అభిమానులను, ప్రేక్షకులను అలరించడమే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఇప్పటికే విభిన్న పాత్రలు చేసినా, విభిన్న కథలు ఎంచుకున్నా.. ఇంకా ఎంతో చేయాలని తెలుగు జాతి ప్రేరణ ఇస్తోందని చెప్పారు.

‘ఆహా’ ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్‌ మానస పుత్రిక. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా ‘ఆహా’ను స్థాపించారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదు.దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక మనిషి ప్రజెంటేషన్‌ ఆహాలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ ‘ఆహా’. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని… అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుందని బాలయ్య చెప్పారు.

బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి బయటకొస్తారు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్‌స్టాపపబుల్‌’. మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందని.. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయన్నారు. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో తనకు బాగా నచ్చిందని. అందుకే ఒప్పుకొన్నట్లు తెలిపారు. మళ్లీ కలుద్దాం.. ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్‌” అని బాలకృష్ణ చెప్పారు.

 

AHA launches Unstoppable with NBK | 123telugu.comఅల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలయ్య బాబే ఓ అన్ స్టాపబుల్ హీరో.. ఈ టాక్ షో కూడా నిరాటంకంగా… దిగ్విజయంగా సాగిపోతుంది అన్నారు అల్లు అరవింద్.

Related posts