telugu navyamedia
సినిమా వార్తలు

నర్సిపట్నం కుర్రాడి క‌ల నెర‌వేరింది..చిరు సినిమాలో ఛాన్స్‌

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క‌ల నెర‌వేరింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘గాడ్​ఫాదర్‌. మలయాళ సూప‌ర్ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్​గా ‘గాడ్​ఫాదర్’​గా రూపొందుతోంది.

గాడ్​ఫాదర్‌ సినిమాలో పూరి జగన్నాథ్‌కు ఓ ప్రత్యేకమైన పాత్ర చేయడానికి పూరికి అవకాశం కల్పించారు మెగాస్టార్ . తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిరు.

Puri Jagannadh Cameo In Chiranjeevi's Godfather

” నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్​ఫాదర్​ మూవీలో స్పెషల్​ రోల్​ చేస్తున్న పూరి జగన్నాథ్​ను పరిచయం చేస్తున్నా.” అని ట్వీట్​ చేశారు చిరు.

ఈ సినిమాలో చిరుకు జోడిగా లేడీ సూపర్​స్టార్ నయనతార హీరోయిన్​గా న‌టిస్తోంది. సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.తమన్ సంగీతమందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మరోవైపు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది.  

Related posts