telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బంగార్రాజు”కు బ్రేకులు… మరో సినిమాకు సిద్ధమవుతున్న నాగ్ ?

Nag

సరిగ్గా మూడేళ్ళ క్రితం సంక్రాంతికి నాగార్జున ప్రధానపాత్రలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన “బంగార్రాజు” పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సోగ్గాడే చిన్నిం నాయనా చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రాన్ని కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే `బంగార్రాజు` సినిమా చేయాలని నాగ్ భావించారు. ఈ మేరకు కల్యాణ్ కృష్ణ చాలా సమయం వెచ్చించి స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడు. నాగార్జున, నాగచైతన్య ఈ సినిమాలో కలిసి నటించాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చైతూ కోసం చాలా మంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. మరోవైపు దర్శకుడు కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాల రీత్యా కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో `బంగార్రాజు` సినిమా ఇప్పట్లో లేనట్టే అని అనుకుంటున్నారు. ‘బంగార్రాజు’ వాయిదా పడడంతో కొత్త దర్శకుడు సొలమన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి నాగ్ అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట.`మన్మథుడు-2` తర్వాత `కింగ్` నాగార్జున ఇప్పటివరకు మరో సినిమాను పట్టాలెక్కించలేదు.

Related posts