telugu navyamedia
సినిమా వార్తలు

సోష‌ల్ మీడియాను షేక్ చేసిన మెగా సెలబ్రేషన్ !

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే ఇండస్ట్రీతో పాటు మెగా ఫ్యామిలీలో కూడా పండగ వాతావరణం నెల‌కొంది. చిరంజీవి చెల్లెల్లు, తమ్ముళ్లు, వారి ఫ్యామిలీస్, పిల్లలు అంత ఒకే దగ్గర చేరి చిరంజీవికి శుభాకాంక్షలు చెప్తూ ఫుల్ గా ఎంజాయి చేశారు.

అయితే చిరు బర్త్ డేతో పాటుగా రాఖీ పండుగ కూడా క‌లిసి రావ‌డంతో సంబరాలు మ‌రింతరెట్టింపయ్యాయి.

అంతేకాకుండా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీతో మెగా ఇంట్లో ఆనందం వెల్లివిరిసినట్టైంది. రాఖీ పండుగ, అన్నయ్య పుట్టిన రోజు కావడంతో పవర్ స్టార్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదట తన ఇంట్లోకి పవన్ కళ్యాణ్ రాగానే హత్తుకుని ముద్దుపెట్టాడు చిరంజీవి. దీంతో పవన్ కూడా అన్నయ్యని గట్టిగ హగ్ చేకున్నాడు. ఈ అన్నదమ్ముల ఏమోషనల్ సీన్ మెగా అభిమానులకి కన్నుల పండగలా మారింది.

Mega Day of Mega Star Chiranjeevi | August 22, 2021 - YouTube

ఇంతలో పక్కనుండి చిరంజీవి భార్య సురేఖ రావటంతో వదినమ్మ దెగ్గరికి వెళ్లి సెటైర్ వేస్తాడు పవన్. దీంతో వదినమ్మ పవన్ వీపులో ప్రేమతో కొడుతోంది. అన్నదమ్ముల సీన్ తో పాటు, వదిన మరిదిల సీన్ కూడా మరో హైలైట్ గా నిలిచింది.

మెగాస్టార్ బర్త్ డే పార్టీలో.. పవన్ కళ్యాణ్ ని కొట్టిన చిరంజీవి భార్య సురేఖ.. అందరిముందే అలా.. వీడియో వైరల్ - TNews Telugu

అయితే చాలా గ్యాప్ తరువాత అన్నయ్య ఇంటికి రావటంతో వదినమ్మని పట్టించారు పవన్ కళ్యాణ్. ‘ ఏం వదినమ్మ గారు బాగున్నారా? అంటూ చిరంజీవి ముందే పవన్ కళ్యాణ్ ఫన్నీగా కామెంట్ చేశారు. దీంతో దగ్గరికి వచ్చిన సురేఖ.. పవన్ కళ్యాణ్‌ను ప్రేమగా కొట్టేశారు.

దీంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ నవ్వేశారు. ఇలా మెగా ఫామిలీ అంత ఒకేచోట చేరటంతో అభిమానులకు చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఏదేమైనా చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ సినిమా అప్డేట్స్ , ఫ్యాన్స్ విషెష్, ఫ్యామిలి సెలబ్రేషన్స్, బర్త్ డే పార్టీ ఇలా సోషల్ మీడియాని షేక్ చేసింది.

On-Megastar-Chiranjeevi's-Birthday,-Son-Ram-Charan,-Niece-Upasana -Konidela---Familly-Members-108

Related posts