telugu navyamedia
సినిమా వార్తలు

గురక పెట్టినందుకే చంపేసిందట…!?

Mum

యూకేలోని హల్ రాయల్ ఇన్‌ఫార్మరీ ఆసుపత్రిలో తోటి పేషంట్ గురక పెడుతోందని మరో పేషంట్ కప్పుతో కొట్టి హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… అయ్‌లీన్ అనే 64 ఏళ్ల వృద్దురాలిని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చగా.. నెమ్మదిగా కోలుకుంటూ వస్తున్న సమయంలో తోటి పేషంట్ ఈ ఘాతుకానికి పాల్పడింది. వృద్దురాలు గురక పెడుతోందని.. పక్కనే ఉన్న కప్పుతో ఆమె తలపై కొట్టి హతమార్చినట్టు డాక్టర్లు తెలిపారు. వృద్దురాలి కొడుకు మాత్రం దీనిపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లిని చంపే ముందు ఎవరూ లోపలకు రాకుండా.. గది తలుపును దుప్పటితో కట్టేసినట్టు నర్సులు గమనించినట్టు తనతో చెప్పారని పేర్కొన్నాడు.

Related posts