telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశభక్తికి ఇది అంకితం..

Indian flag
అనాది చరితల
ప్రభాత గీతం
నినాద కవితల
నడిపే ఊతం
విశాల భారత
పునాది కదిపిన
వినాశ బుద్ధితో
ఆశలు కుదిపిన
మృగాలనణచిన
తరాల సమరం
జగాన నిలిపిన
సుకీర్తి అమరం
శాంతిని నేర్పిన
ఖ్యాతిన ఒదిగి
సవాళ్ళనోర్చిన
రీతిన ఎదిగి
ప్రపంచపటాన
తెలివికి నెలవై
అడుగడుగున
కళలకు కొలువై
పొంగును భక్తి
మా ఊపిరి నిండా
రెపరెపలాడును
నా దేశపు జెండా

Related posts