telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గంధం పొడితో బాదం కలిపి ఇలా చేస్తే…

తెల్లని చర్మం మీసొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే మీకోసం కొన్ని నాచురల్ టిప్స్ . తెల్లగా ప్రకాశవంతమైన చర్మం చాలా ఆకర్షనీయం గా ఉంటుంది. తెల్లని చర్మం కోసం చాలా మంది చాలా పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు.
కాని ఇంట్లో తయారు చేసిన పేస్ పాక్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఖర్చు తక్కువ.
ఎక్కువగా పాలు, తేనే, పెరుగు, వోట్స్ మరియు పండ్ల రసాలతో పాక్స్ వేయడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలుగదు. ఇవి చర్మానికి చాల మంచిది.
చర్మం తెల్లగా పొందడానికి మరియు దోషరహిత చర్మం పొందడానికి సాండిల్ వుడ్(గంధం)పేస్ట్ ను ఉపయోగిస్తారు. గంధం పొడిని బాదంతో చేర్చి పొడి చేసుకోవాలి . ఈ రెండింటి మిశ్రమంను పాలతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.
సిట్రస్ పండ్లు చర్మం తెల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి . ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, ఆపొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
పది రోజుల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే, ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని 15నిముషాలు అలాగే వదిలేసి, ఎండిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మఛాయ మెరుగుపరచడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
కీరకాయ రసంకీ తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకసారి ముఖం, మెడకు పట్టించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
చర్మఛాయను తెల్లగా మార్చడంలో స్వీట్ హానీ చాలా అద్భుతాలను చేస్తుంది. మీరు ఫెయిర్ గా మరియు యవ్వనంగా కనబడాలంటే కొద్దిగా నిమ్మరసంతో కలిపిన హనీ ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి. ముఖం, మెడకు పట్టించిన తర్వాత, పొడిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కలబంద, చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ మీద నలుపును తగ్గిస్తుంది . ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది . తాజాగా ఉండే కలబంద కట్ చేసి దానిలోని జెల్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖం, మెడకు అప్లై చేయాలి.
ఒక అద్భుతమైన మార్పును మీరు కోరుకుంటున్నట్లైతే, ఈ పదార్థంను మీరు ట్రై చేయవచ్చు. పసుపు చర్మఛాయను మెరుగుపరుస్తుంది. పసుపు, పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. చాలా అద్భుతమైన ఫెయిర్ నెస్ స్కిన్ పొందవచ్చు. ఇంకా పసుపు మొటిమలను తొలగించి ముఖంలో నలుపుదనం పోగొడుతుంది.
మీరు మిల్క్ వైట్ గా కనబడాలంటే, మీరు పాలను ఉపయోగించాల్సిందే. కాటన్ బాల్స్ ను పాలలో డిప్ చేసి, మీ ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి చర్మ ఛాయను పొందవచ్చు.
బంగాళదుంపలో బ్లీచింగ్ ఏజెంట్స్ పుష్కలంగా ఉన్నందున, చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది . నెలలో మూడు సార్లు బంగాళదుంపతో ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి మార్పు వస్తుంది. బంగాళదుంపను పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Related posts