telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి ఊహించని షాక్

చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి దశలో విరుచుకుపడిన కరోనాతో పోల్చితే.. రెండో దశ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇటు టీకాల కొరత ఇండియాను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కు కొత్త సమస్య వచ్చింది. తాజాగా ప్రకటించిన WHO అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు. అయితే WHO అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని యూఎస్, యూకే దేశాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి అమెరికా, యూకే లోకి అనుమతించబోమని ఆ దేశాలు అంటున్నాయి. దీంతో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ ను తీసుకోవడానికి చాలా మంది సందేహిస్తున్నారు. అటు తమ టీకా.. అమెరికా, యూకే లోని వైరస్ ను సమర్థవంతంగా ఎదురుకుంటుందని భారత్ బయోటెక్ అంటోంది. కానీ కోవాగ్జిన్ కు WHO అత్యవసర యూజ్ లిస్టింగ్ లో చోటు దక్కక పోవడం ఆందోళకర అంశం.

Related posts