telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యాస్ తుఫాన్ : ఏపీ సర్కార్ అలర్ట్

యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపి ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. యాస్ తుఫాన్ ప్రభావం ఏపి తో పాటు ఐదు రాష్ట్రాలపై వుంటుందని రాష్ట్ర ప్రభుత్వంను అలెర్ట్ చేసింది కేంద్రం. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఈనెల 24 లోగా సమీకరణ చేయనుంది. అంగుల్, కరీం‌నగర్, రూర్కెల నుండి‌ కూడా రోడ్ మార్గం‌లో ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ సర్కార్. మరో వైపు విశాఖపట్నం పోర్టుకు 120 మెట్రిక్ టన్నుల LMO ట్యాంకర్ల్ ను పంపిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్..120 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను గుంటూరు, తిరుపతి లో బఫర్ స్టాక్ పద్దతిలో స్టోర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని RINL,EIL,లిక్వినాక్స్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఆక్సిజన్ ఉత్పతి కోసం నిరంతరంగా విద్యుత్ సరఫరా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పేషెంట్ లకు ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు‌ లేకుండా ముందస్తుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్లు సిద్దం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్.

Related posts