telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సింగరేణిలో ప్రారంభమైన సలార్ షూటింగ్…

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. తాజాగా ఈ సినిమా షూటింగ్​ సింగరేణి ఆర్​జీ 3 ఓపెన్​ కాస్ట్​-2 లో ఈరోజు ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్​జీ3 పరిధిలోని 3 ఓపెన్​ కాస్ట్​-2 లో సలార్​ సినిమా షూటింగ్​ ను ఈ రోజు ప్రారంభించారు. బొగ్గుగని కార్మికుల నేపథ్యం ఉన్న ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సినిమా దర్శకుడు సింగరేణిలోని ఉపరితల గనులను పరిశీలించి ఈ రోజు షూటింగ్​ను ప్రారంభించారు.  అంతకుముందు సినిమా హీరో ప్రభాస్​ గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌజ్​లో బస చేశారు. రామ గుండం కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ సత్యనారాయణ ప్రభాస్​ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సలార్​ మూవీ షూటింగ్​ కోసం గత నాలుగు రోజులుగా యూనిట్ సభ్యులు బొగ్గు గనిపై సెట్టింగ్స్​ ఏర్పాటు చేశారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో పలు భాషల్లో సలార్​ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు చిత్రీకరణ ప్రారంభమవుతోందని తెలిసి.. ప్రభాస్​ను చూసేందుకు స్థానికులు, ప్రభాస్ అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ పోలీసులు ఎవరినీ షూటింగ్ లోకి అనుమతించలేదు. షూటింగ్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ను కూడా అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Related posts