telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అసలు ఏంజరిగిందంటే’ ట్రైలర్ విడుదల

asalemjarigindi

‘దేవి’ సినిమాలో మాంత్రికుడు ఆవహించిన పిల్లాడిగా నెగిటివ్ షేడ్స్ చూపించిన బాల నటుడు. అతని పేరు మహేంద్రన్. రెండేళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టిన మహేంద్రన్.. తెలుగులో బాలనటుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నాడు. చాలా ఏళ్ల తరవాత ఇప్పుడు మహేంద్రన్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు ‘అసలు ఏంజరిగిందంటే’ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు. . శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించారు. ఏబీఆర్ ప్రొడక్షన్స్, జీఎస్ ఫిలిమ్స్ పతాకాలపై అనిల్ బొద్దిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మార్చి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏదో ఒక స్పెషల్‌తో హీరోగా పరిచయం అవ్వాలనే ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాను. రవితేజ గారి పాత్రలా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్టుగా ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

Related posts