telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఆ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా ?

ఈ మధ్య కాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా… స్వయంగా ఎవరికీ వారే డాక్టర్లు అయిపోతున్నారు. డాక్టర్స్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా టాబ్లెట్స్‌ వాడుతున్నారు. ఇందులో భాగంగా విటమిన్‌ డి పిల్స్‌ కూడా యధేచ్చగా వాడేస్తున్నారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు విటమిన్‌ డి పిల్స్‌ తీసుకోకూడదు. శరీరంలో విటమిన్‌ డి లెవల్స్‌ ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది. విటమిన్‌ డి ట్యాబ్లెట్స్‌ తీసుకునే ముందు శరీరంలో విటమిన్‌ డి ఏ స్థాయిలో ఉన్నాయో అనేది టెస్ఠ్‌ చేయించి తెలుసుకోవాలి. శరీరం నలుపు ఉన్న వారిలో విటమిన్‌ డి తక్కువగా ఉత్పత్తి అవుతుందని.. అలాగని వారిలో నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అంచనా వేయలేమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్‌ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. విటమిన్‌ లెవెల్స్‌ అధికంగా ఉన్న వారిలో కళ్లు తిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కడుపు నొప్పి, మలబద్దకం, విరేచనాలు కూడా విటమిన్‌ డి పిల్స్‌ అధిక మోతాదులో తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు. విటమిన్‌ డి పిల్స్‌ ఎక్కవగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

Related posts