telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటుడు పృథ్వీరాజ్ కు నిజంగానే కరోనా ?

Prudhviraj

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ నిన్న తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తనకు పదిరోజులుగా జ్వరం వస్తోందని, కరోనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని అందులో చెప్పారు. కాగా మళ్ళీ ఈరోజు ఆయన తనకు కరోనా పాజిటివ్ అని తెలుపుతూ తాను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు ఫోన్ చేసి దైర్యం చెప్పారని, యుద్ధరంగంలో దిగాక పోరాడాలని రాంబాబు గారు తనలో దైర్యం నింపాడని అన్నారు. నిన్నటికంటే తన ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు. కాగా పృద్విరాజ్ నిన్న తనకు నెగిటివ్ అని, మళ్ళీ ఈరోజు పాజిటివ్ వచ్చిందని చెప్పటంపై నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts