భారత క్రికెటర్లు జస్ప్రిత్ బుమ్రా, స్టార్ బ్యాట్స్‌విమెన్ స్మృతి మందాన ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానాక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన ఐదుగురిలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. ఆసియా నుంచి పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్, శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నె, అఫ్గనిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ ఈ అవార్డును అందుకోనున్నారు.
మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, దీప్తీ శర్మ తర్వాత స్మృతి మందాన ఈ పురస్కారానికి ఎంపికైన మూడో క్రీడాకారిణి కావడం విశేషం. ఈ సీజన్ వీరంతా తమ తమ విభాగాల్లో అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో వీరిని అవార్డు కమిటీ ఎంపిక చేసింది. లెజెండ్స్ గుండప్ప విశ్వనాథ్, లాలా అమరనాథ్ విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.