telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముగిసిన భారత్ ఇన్నింగ్స్…

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత మొదటి ఇన్నింగ్స్ కు తెర పడింది. అయితే నిన్న వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 62/2 తో నిలిచిన భారత్ నేడు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో రహానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా అదే దారిలో పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు సుందర్(62), శార్దుల్(67) అర్ధస్తకాలతో రాణించడంతో 300 పరుగులకు దాటింది. కానీ ఆ తర్వాత శార్దుల్ ఔట్ అయిన కాసేపటికే గాయం నుండి కోలుకొని బ్యాటింగ్ కు వచ్చిన సైని, సుందర్ వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత చివరి వికెట్ గా సిరాజ్(13) పరుగులు చేసి ఔట్ కావడంతో 336 పరుగుల వద్ద భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో టీం ఇండియా కంటే ఆసీస్ ఇంకా 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 10 ఓవర్లు ఉండటంతో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Related posts