telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూన్ లో ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’

rgv

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని చిత్రబృందం వెల్లడించింది. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ కానుందని వారు చెప్పారు. చైనాలోనూ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.

Related posts