telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “మర్డర్” సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Murder

రామ్‌గోపాల్‌ వర్మ ‘మర్డర్‌’ సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది హైకోర్టు. వివరాల్లోకి వెళ్తే… సంచలన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన క‌ల్పిత చిత్రం “మ‌ర్డ‌ర్”. వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ధియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ చిత్రబృందం అనుకుంది. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ ‌అమృతా ప్రణయ్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టుకెక్కారు. ఈ సినిమాలో తమ అనుమతి లేకుండా త‌న పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ ఆ సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌పై సూట్ ఫైల్ చేశారు. సినిమాను నిలిపివేయాలంటూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు “మర్డర్”‌ సినిమాపై నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను కొట్టేసింది. అయితే సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు వాడకూడదని షరతు విధించింది. ఈ మేరకు “మర్డర్” టీం సినిమాలో అమృత, ప్రణయ్‌ పేర్లు వాడబోమని స్పష్టం చేసింది.

Related posts