దేశంలో ఎన్నికల ప్రచారం మంచి రసపట్టుమీద ఉండగా, ముఖ్యనాయకులు మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదు. చేసింది ఏమిలేదుగాని మళ్ళీ ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ వాగ్వాదానికి దిగేవారు కొందరైతే మరొకొందరు ఏకంగా చేతిలో ఏది ఉంటె దానిని సదరు నేతపై విసిరేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా, తమిళనాడులో కూడా ఇదే జరిగింది. అయితే ఇక్కడ ఒక సాధారణ నేతకు కాదు, ఏకంగా రాష్ట్ర సీఎం కే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలో తంజావూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పులు విసిరాడు. దీనితో ప్రచారంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ ఘటన భద్రతా పర్యవేక్షణ సరిగా లేకపోవడం, సిబ్బంది కొరవడడం వల్లే జరిగినట్టుగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. సీఎంపైకి చెప్పులు విసిరిన వ్యక్తిని ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. ముఖ్యమంత్రుల పైకి చెప్పులు విసరడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోకి చొరబడిన ఓ వ్యక్తి ఆయనపై ఇంకుతో చేసిన దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్