telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాఠశాల ఆవరణలో లభించిన వీవీప్యాట్ స్లిప్పులు

OU students wrote letter to EC

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్పులు మరోమారు కలకలం రేపాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 200 వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిని గుర్తించిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలుపగా, వారు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అవి ఈవీఎంల ర్యాండమైజేషన్‌ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు.

ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో అవి లభించడంతో విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి. ఇదే పాఠశాలలో మరోమారు వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో నాలుగు స్లిప్పులు కనిపించాయి. వీటిపై నోటా గుర్తులున్నాయి. విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారొచ్చి స్పిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఉన్న వివరాల ఆధారంగా అవి దేపూరు పోలింగ్ కేంద్రం స్లిప్పులుగా గుర్తించారు. ఈ వ్యవహారం పై అధికారులను పోలీసులు విచారిస్తున్నారు.

Related posts