telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుకు .. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన .. జగన్.వైఎస్

chandrababu on amaravati mla quarters
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేడు చంద్రబాబు తన 70వ పుట్టిన రోజును పురస్కరించుకొని, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం 8.26కు జగన్ ట్వీట్ పెట్టగా, అది నిమిషాల్లో వైరల్ అయింది. 
నెటిజన్లు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు వినూత్నంగా రియాక్ట్ అవుతున్నారు. కాబోయే సీఎం, మాజీ కాబోతున్న సీఎంకు అభినందనలు చెప్పారని, శత్రువైనా దగ్గరకు తీసుకునే మనస్తత్వం జగన్ దని, జగన్ ది చాలా పెద్ద మనసు అని, చంద్రబాబు జగన్ నుంచి శుభాకాంక్షలు ఊహించి వుండరని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related posts