telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బరువు తగ్గాలా.. ఇవి తింటే సరి..

veg food is best for weight balance

ఏదైనా అతి ప్రమాదమే.. కానీ నేడు ఎక్కడ చూసినా ఈ పదం ఎక్కువగానే కనిపిస్తుంది. అందులోను అతి ప్రేమ ఇంకా ప్రమాదకరం.. అదికూడా నేటి తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ప్రేమ ఇంకా ప్రమాదకరం. అతిప్రేమతో.. గారం చేసి, కొసరికొసరి ఎంత తింటున్నారో చూసుకోకుండా పెట్టేయడం, అదికూడా ఏది అడిగితే అది. అలా చేసి, మళ్ళీ వాళ్ళు అధిక బరువుతో బాధపడుతుంటే.. చూసి తల్లడిల్లిపోవడం. పిల్లలు కడుపు మాడ్చుకుంటూ ఉంటె చూసి అల్లల్లాడి పోవడం ఇప్పటి తల్లిదండ్రులకు సహజం అయిపోయింది. అవన్నీ అతిప్రేమతో వచ్చిన తిప్పలే. అందుకే మొదటి నుండి ఏది మంచి ఆహారంలో అదే పిల్లలకు ఇస్తుంటే, వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తల్లిదండ్రులు కూడా వారిని చూసుకొని మనశాంతిగా ఉంటారు.

అయితే ఇప్పటికే ఈ అతిప్రేమతో బరువు సమస్యతో బాధపడుతున్న వారికీ కూడా ఇకనుండి దాని నుండి దూరంగా ఉండేందుకు చిన్న ఇంటి చిట్కాలు..అధిక బ‌రువు త‌గ్గాలనుకుంటే, శాకాహారం మాత్ర‌మే తీసుకోండి, త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు. శాకాహారం తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయ‌ని, దీనితో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతోపాటు అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు అధిక బ‌రువు త‌గ్గేందుకు శాకాహార డైట్‌ను సూచిస్తున్నారు.

అదేమిటంటే…శాకాహార డైట్‌ను ఫాలో అయ్యేవారు జంతు సంబంధ ప‌దార్థాల‌ను పూర్తిగా మానేయాలి. అంటే చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, కోడిగుడ్లు, ఆఖ‌రికి పాలు, పాల సంబంధ ప‌దార్థాలు, తేనెను కూడా పూర్తిగా మానేయాలి. ఇక కింద చెప్పిన విధంగా మూడు పూట‌లా భోజ‌నం ప్లాన్ చేయాలి.

బ్రేక్‌ఫాస్ట్

శ‌రీరానికి శ‌క్తినికి అందించ‌డంలో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైంది. క‌నుక బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ మాన‌కూడ‌దు. అందులో ఒక పండు లేదా వెజిట‌బుల్ స‌లాడ్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే న‌ట్స్‌, ఓట్ మీల్‌, శాండ్ విచ్‌, క్వినోవా, ఫ్రూట్ స్మూతీ, సోయా, బాదం మిల్క్ తీసుకోవాలి.

లంచ్

మ‌ధ్యాహ్నం భోజ‌నంలో కూర‌గాయ‌లు, ప‌ప్పులు, అన్నం, గోధుమ పిండి లేదా చిరు ధాన్యాల‌తో చేసిన రొట్టెలు, చిక్కుడు జాతి గింజ‌లు, కూర‌గాయ‌ల స‌లాడ్‌, న‌ట్స్‌, సీడ్స్ తీసుకోవ‌చ్చు. దీనితో ప్రోటీన్లు స‌రిగ్గా అందుతాయి.

డిన్న‌ర్

రాత్రి భోజ‌నం చాలా లైట్‌గా చేయాలి. త‌క్కువ తినాలి. అందులో ప‌ప్పులు, బియ్యంతో త‌యారు చేసిన కిచ్‌డీ ఉండాలి. అవ‌స‌రం అనుకుంటే అందులో కూర‌గాయలు వేసుకోవ‌చ్చు. లేదా కూర‌గాయ‌ల‌తో త‌యారు చేసే సూప్ తాగ‌వ‌చ్చు. శ‌న‌గ‌లు, టమాటాలు, ఉల్లిపాయ‌లు త‌దిత‌ర కూర‌గాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌వ‌చ్చు.

పైన చెప్పిన డైట్‌ను పాటిస్తే ఎవ‌రైనా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Related posts