telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

చంద్రబాబు, లోకేష్ బాబు ల .. నామినేషన్ పాత్రలలో తప్పులు.. సరిచేసిన అధికారులు !

Chandrababu Nomination Buvaneshwari

ఇటీవల ఏపీసీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లు నామినేషన్ లు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే అందులో చిన్నపాటి తప్పిదం గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, లోకేశ్ మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులు ఇద్దరూ తమ ఓటు హక్కు ఎక్కడ ఉన్నదీ చెబుతూ అందకు సంబంధించిన అధికారిక పత్రాన్ని నామినేషన్ పేపర్లతో జత చేశారు. వీరిద్దరికీ తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలోనే ఓటుహక్కు ఉంది.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలలోని ఓ కాలమ్‌లో చిన్నపాటు పొరపాటు జరిగింది. చంద్రబాబు నాయుడు నారా నామినేషన్ పత్రాలలో భర్త స్థానంలో ఖర్జూరనాయుడు అని బాబు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో అలాగే లోకేశ్ నారా నామినేషన్ పత్రాలలో భర్త స్థానంలో చంద్రబాబునాయుడు అని లోకేశ్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. ‘తండ్రి’ అని ఉండాల్సిన చోట ‘భర్త’ అని ఉన్నప్పటికీ అధికారులు గుర్తించకుండా సంతకం చేసి ఇచ్చేశారు. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు దానిని సరిచేసి మళ్లీ కొత్త వాటిని జత చేశారు. ఈ పొరపాటు వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు.

Related posts