telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ న్యూ లుక్ వైరల్

Vijay-Devarakonda

యంగ్ సెన్సేష‌న‌ల్ హీరో ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకుడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి లుక్‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లో “ఫైట‌ర్” మూవీ అనే సినిమా కూడా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ బాక్సర్‌గా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఇందులో భాగస్వామిగా చేరబోతున్నట్లు తెలిసింది. అయితే విజయ్ దేవ‌ర‌కొండ ఎంత స్టైలిష్‌గా ఉంటారో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. డ్రెస్, హెయిర్ స్టైల్‌, బియ‌ర్డ్ ఇలా ప్ర‌తీ దాంట్లో ఎప్పుడు కొత్త ద‌నాన్ని ట్రై చేస్తుంటారు. పింక్ క‌ల‌ర్ సూట్‌లో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫోటో షూట్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ గెట‌ప్‌లోకి మారిన‌ట్టు తెలుస్తుంది.

Related posts