telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్త పక్కనే ఉండగా హీరోయిన్ తో హీరో రొమాన్స్… ఇబ్బంది తప్పదుగా…!

Suriya

సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ నెల 20న విడుద‌ల కానున్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జ‌రిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్య ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బందోబస్త్ చిత్రంలో సూర్య సరసన కుర్ర బ్యూటీ సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయేషా సైగల్, తమిళ హీరో ఆర్య ఈ ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఆ పాత్రలో అల్లు శిరీష్ నటించాల్సింది అని సూర్య తెలిపాడు. కొన్ని కారణాలవల్ల చివరి నిమిషంలో ఆర్యని తీసుకున్నాం అని పేర్కొన్నాడు. ఆర్య పక్కనే ఉండగా సాయేషాతో రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని సూర్య తెలిపాడు. ఇక ఈ చిత్రంలో తాను చాలా లుక్స్ లో కనిపించబోతున్నట్లు సూర్య వెల్లడించాడు.

Related posts