telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా డోసులను కేంద్రానికి ఉచితంగా ఇచ్చిన భారత్ బయోటెక్ సంస్థ…

Corona Virus Vaccine

ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించిన రెండు టీకాలు ఇంద్రియాలు అందుబాటులోకి వచ్చాయి. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సీన్ లు అందుబాటులోకి వచ్చాయి.  కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేశారు.  సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రానికి ఒక్కో డోసును రూ.200లకు విక్రయించింది.  1.1 కోట్ల డోసులను సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రానికి అందజేసింది.  ఇక భారత్ బయోటెక్ సంస్థ సంస్థ తయారు చేసిన 55 లక్షల కోవాక్సీన్ వ్యాక్సిన్లు కేంద్రానికి అందించింది.  ఒక్కో డోసును రూ.295 కి అందించింది.  అయితే, భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన 55 లక్షల డోసుల్లో 16.5 లక్షల డోసులను కేంద్రానికి భారత్ బయోటెక్ సంస్థ ఉచితంగా అందించడం విశేషం.  ఇక టీకా సమర్ధతపై కేంద్రం స్పష్టతను ఇచ్చింది.  టీకాపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, పూర్తి సమర్ధతతో కూడుకొని ఉన్నాయని, స్థానిక భాషల్లో టీకాపై ప్రజలకు అవగాహనా కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. చూడాలి మరి ఇవి ఎలా పనిచేస్తాయి అనేది.

Related posts