telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సపోటా, దాని గింజలు మింగేస్తున్నారా ?

సపోటా పండు, ఈ ఎండాకాలం దొరికే సీజనల్ ఫ్రూట్. అలాంటివి ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైనా నీరసంగా బాగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది. దీనిలో ప్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర సమృద్దిగా ఉండటమే కారణం. రక్తహీనతతో బాధపడేవారు సపోటాని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సపోటాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌, ఏ, సీ, ఈ, రాగి, ఇనుము మొదలైన ఖనిజ లవణాలు సైతం లభిస్తాయి. సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్‌ పుష్కలం. దానివల్ల సపోటా తినడం వల్ల గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులుకు పోషక విలువలు త్వరగా అందుతాయి. వీరలో శక్తిని పెంచుతుంది. స్థూలకాయం లేదా ఊబకాయ సమస్యలతో బాధపడేవారు సపోటా తినడం మంచిది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్‌ తాగడం గానీ చేస్తే జుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తల వెంట్రుకలకు పోషకాలు అందుతాయి. సపోటా తింటే విటమిన్‌-ఏ లభిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది. కంటిచూపు తగ్గకుండా రోగనిరోధక శక్తి పెంచుతుంది. సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని తొందరగా పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు కొంతమేర పరిష్కారం చూపుతుంది.

Related posts