హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ గేటు వద్ద ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునేందుకు యత్నించాడు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చందర్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చురుగ్గా పాల్గొన్నారు. ఇక 2010లోనూ అసెంబ్లీ ఎదుట చందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తమ కష్టాలు తీరడం లేదని చందర్ అన్నారు. ఇప్పటి వరకు ఇల్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలి: చంద్రబాబు