మూఢ నమ్మకాలతో తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చొద్దని కాంగ్రెస్ నేత, తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పారు. భవనాల తరలింపు వల్ల రికార్డులు మాయమైతే ఎవరు బాధ్యులని రేవంత్ ప్రశ్నించారు. భవనాలను కూల్చి కొత్తవి కట్టడంవల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని రేవంత్ అన్నారు. ఈ విషయంలో గవర్నర్ స్పందించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
కూల్చివేతల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. సచివాలయ భవనాల కూల్చివేతను ఆపాలని కొత్తవి అక్కర్లేదని మాజీ ఎంపీ గడ్డం వివేక్ అన్నారు. కూల్చివేతలు ఆపండని టీడీపీ నేత ఎల్.రమణ సూచించారు. సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేసి కొత్త భవనాల నిర్మాణం అంటున్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు.