బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారోగ్యంతో శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా నది తీరంలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు బీజేపీ ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రులు, ఇతరులు హాజరయ్యారు. అంత్యక్రియల్లో సెల్‌ఫోన్ల దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అయితే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో 11 మంది సెల్‌ఫోన్లు మాయం అయ్యాయి. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో, పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజరవాలా ఫోన్లు కూడా చోరీకి గురైనట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఐదుగురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 11 సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు తిరస్కరించినా లోకేశ్ కు బుద్ధి రాలేదు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు