telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన నిర్మాత సంస్థ

Vijay-Devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ క్షమాపణలు చెప్పింది. విలక్షణ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా, మరోవైపు ‘ఫైటర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుస సినిమాలతో జోరు మీదున్న విజయ్ దేవరకొండతో కలిసి డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సినిమా చేస్తున్నామని చెప్తూ కొందరు వ్యక్తులు ఇటీవల పలువురు హీరోయిన్లను సంప్రదించారు. తమ సినిమా కోసం విజయ్ ఇప్పటికే సంతకం చేసేశాడని, మీరు కూడా అంగీకరించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఇది నిజమో, కాదో తెలుసుకునేందుకు వారు విజయ్‌ బృందాన్ని సంప్రదించారు. ఆ నిర్మాణ సంస్థతో విజయ్ సినిమా తీయడం లేదని విజయ్ బృందం ధ్రువీకరించింది. అంతేకాదు విజయ్ పేరును వాడుకుంటున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. దీంతో స్పందించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల తమ సంస్థ పేరు బయటకు వచ్చినట్టు స్పష్టం చేసింది. తప్పుడు ఆడిషన్స్‌కు కారణమైన పలువురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హీరో విజయ్ కు డస్కీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ హామీ ఇచ్చింది.

Related posts