telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

రేపటి నుంచి ప్లాస్టిక్ బంద్… దాని స్థానంలో వెదురు బాటిళ్లు…!

Plastic

ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతోంది. ప్లాస్టిక్ వాడకం వల్ల మనం భవిష్యత్తులో ఎదుర్కొనబోయే నష్టాలను గురించి చాలాకాలం నుంచి హెచ్చరిస్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. అయితే ప్లాస్టిక్ పై నిషేధం విధించినప్పటికీ ఇప్పటికీ కొన్నిచోట్ల ప్లాస్టిక్ వాడకం తగ్గకపోవడం గమనార్హం. కాగా… మహాత్మా గాంధీ 150వ జయంతిని పురష్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించింది. రేపటి నుంచి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అమ్మినా.. వినియోగించినా భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టీలు, గాజు, వెదురు బొంగులతో తయారు చేసిన బాటిళ్లను వినియోగించాలని కేంద్రం సూచించింది. గాంధీ జయంతి సందర్భంగా రేపటి నుంచి వెదురుబొంగుతో తయారు చేసిన బాటిళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఖాదీ షాపుల్లో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. 750 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.300 గా నిర్ణయం తీసుకుంది. మొదటి విడతగా కోటి బొంగు బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది చివరికి మరో మూడు కోట్ల బాటిళ్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్రం తెలియజేసింది. దీంతో పాటుగా మట్టితో తయారు చేసిన కప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్రం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Related posts