telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోగా మారిన సప్తగిరి ఫస్ట్ లుక్ వచ్చేసింది

హాస్యనటుడిగా మొదలయ్యి హీరోగా మారిన సప్తగిరి ఫస్ట్ లుక్ వచ్చేసింది. సప్తగిరి తన కొత్త సినిమా ఎయిట్‌ను ఇటీవల ప్రకటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. దీనిని సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి నింపింది. నేడు నూతన సంవత్సరం కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఎన్నడూ చూడని విధంగా సప్తగిరి కనిపించాడు. చాలా సీరియస్ లుక్‌తో సప్తగిరి కనిపించాడు. ఇల్యూజన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో సప్తగిరి స్తాయిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా సప్తగిరి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుందని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Related posts