మహబూబాద్ జిల్లా లో నెల్లికుదురు వద్ద ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి ప్రేమ్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ ప్రేమేందర్ రెడ్డి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే ఈ ఘటనను దాడిని ఖండిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలో తమ వాళ్ళపై దాడి జరిగిందని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. రాత్రంతా టీఆర్‌ఎస్ డబ్బులు పంచినా మేధావులు లొంగ లేదని తెలుసుకుందన్నారు. ఇవాళ కూడా ఓటుకు రూ. 10 వేలు పంచుతుంటే తమ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు. అందుకే ఓటమి భయంతో తమ వాళ్లపై టీఆర్‌ఎస్ దాడులకు దిగుతోందని ఫైర్ అయ్యారు. మేము ప్రతిదాడులకు దిగితే టీఆర్‌ఎస్ ఎదుర్కొలేదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని.. తమ వాళ్ళు తిరగబడితే జరగబోయే పరిస్థితులకు టీఆరెస్ దే బాధ్యత వహించాలన్నారు.
previous post