telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీ.. జీహెచ్ఎంసీ జరిమానా

Minister Talasani Fire to Chandrababu

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై కట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తెలంగాణ పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో నెక్లెస్ రోడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీ ఫేస్ మెంట్ యాక్ట్ కు విరుద్ధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు తలసానికి జరిమానా విధించారు. జరిమానా కింద రూ.25 వేలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

Related posts