telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వరద కాలనీల్లో కేటీఆర్ పర్యటన..మృతుల కుటుంబాలకు ఆర్థికసహాయం

ktr telangana

హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను మంత్రి కేటీఆర్ అందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మంత్రి వెంట ఉన్నారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరమని…. ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని పేర్కొన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు. పారిశుద్ధ్యంపైన ప్రధాన దృష్టి సారించి పని చేయాలని ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన మంత్రి కేటీఆర్…ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Related posts