telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఇంద్రకీలాద్రి పై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం..

vijawadan kanakadurga temple

నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ.. ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ స్వర్ణకవచాలంక్రుత శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అయితే..ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. కోవిడ్‌ ద్రుష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నారు. స్లాట్ లేని, మాస్క్ ధరించని భక్తులకు అనుమతి నిరాకరించారు.
వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరణ..పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం ఇచ్చారు. ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విఐపి లకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. పది సంవత్సరాల లోపు పిల్లలకు 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరించారు. దుర్గగుడి ఉద్యోగులకు ప్రతి మూడురోజులకొకసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts