telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్”లో మోహన్ బాబు కీలకపాత్ర ?

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్ బాబు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సూర్య నటిస్తిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా కూడా త్వరలో తెరకెక్కబోతుంది. మరి ప్రభాస్ “ఆదిపురుష్”లో మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Related posts