telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

థియేటర్లలో మందు అమ్మితే… : దర్శకుడు నాగ్ అశ్విన్

NAg-Ashwin

కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలైంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతైనా జనాలు థియేరట్లకు వస్తారా అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో జనాలను మళ్లీ థియేటర్లకు రప్పించడం ఎలా అనే విషయంపై సినీ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నారు. `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయం గురించి తాజాగా ట్వీట్లు చేశాడు. “విదేశాల తరహాలో సినిమా థియేటర్లలో బీర్, బ్రీజర్, వైన్ మొదలైవని అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒకసారి సురేష్ బాబుగారు, రానాతో చర్చ సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన థియేటర్ల బిజినెస్ పెంచుతుందా? జనాలను ఆకట్టుకుంటుందా? ఇది మంచి ఆలోచనా? కాదా? మీరేం అనుకుంటున్నారు?” అని ట్వీట్ చేశాడు. అనంతరం `అవును.. ఇలా చేయడం వల్ల థియేటర్లకు ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమవుతారు. కానీ, కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో అయినా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదు. జనాలను మళ్లీ థియేటర్ల వైపునకు రప్పించడానికి ఏమి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?” అంటూ నాగ్ అశ్విన్ వరుస ట్వీట్లు చేశాడు.

Related posts