telugu navyamedia
సినిమా వార్తలు

‘హనుమాన్’ ఫస్ట్ లుక్.. గ్లింప్స్

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘జాంబి రెడ్డి’ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుందో తెలిసిందే. తెలుగులో ఒక కొత్త ప్రయోగంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ”హను-మాన్” అనే పేరుతో మరో కొత్త జోనర్ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు ప్రశాంత్.

ఈ సినిమాలో కూడా ఆయన తేజ సజ్జానే హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేసిన దగ్గర నుంచి, కంటెంట్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి తేజ సజ్జా ఫస్టులుక్ తో పాటు, ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ వీడియోలో తేజ సజ్జా గిరిజన యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఉండేల్ ధరించి అడవిలో వేటకి దిగినట్టుగా ఉన్నాడు. ఆయన మెడలో సూర్యుడిని పోలిన ఒక లాకెట్ కనిపిస్తోంది. అదే ముద్ర టైటిల్ లోను కనిపిస్తుంది కనుక, ఆయనలోని సూపర్ హీరో పవర్స్ కి ఆ లాకెట్ కారణమని అనుకోవచ్చు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related posts