telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైద్రాబాద్లో మైనర్లు బండి నడిపితే … జైలుకే !

vehicle to minors welcomes jail

హైదరాబాద్ … ఎన్నో ప్రత్యేకతలు వున్న చారిత్రిక నగరం. ఈ నగరం లో ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా కీలకమైన సమస్య. రోజు రోజుకు పెరుగున్న జనాభా… కొత్త వాహనాలతో … నిత్యము పోలీసులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించేవారి తో పాటు .. పాటించనివారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంది .. పోలీసులు ఎంత అప్రమత్తంగా వున్నా నిబంధనలు పాటించనివారితో సమస్యలు తలెత్తుతున్నాయి.

vehicle to minors welcomes jail2007లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ గా అవతరించింది. దీని పరిధి 175 కిలో మీటర్ల నుంచి 650 కిల మీటర్ల వరకు విస్తరించింది. 2014 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 80 లక్షల 70 వేలు. ప్రస్తుతం 90 లక్షలకు చేరినట్టు తెలుస్తుంది. దేశంలో 4వ పెద్ద నగరం హైదరాబాద్. రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి .. పోలీసులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.

ట్రాఫిస్ ఐలాండ్స్ లో సీసీ కెమారాలు ఏర్పాటు చేసినా ట్రాఫిక్ ఉల్లంఘటనలు జరుగుతూనే వున్నాయి. నిబంధనలు కఠినతరం చేసినా వాహన దారుల్లో పూర్తి మార్పు రావడం లేదు . జరిమానాలు చెల్లిస్తున్నారు తప్ప వాహనదారుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అందుకే ఇప్పుడు హైద్రాబాద్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5000 రూపాయల కట్టాలి. వాహనం ఎక్కువ వేగంతో నడిపితే 2000 రూపాయలు చెల్లించాలి. వాహనంతో ఇష్టం వాచినట్టు రాస్ గా డ్రైవ్ చేస్తే 5000 రూపాయలు వదిలించుకోవలసిందే.

ఇక హెల్మెట్ ధరించకుండా బండి నడిపితే 1000 రూపాలు, మూడు నెలల జైలు మరియు లైసెన్స్ రద్దు అవుతుంది. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్చిందే. అలా కానీ పక్షంలో 1000 రూపాయలు చెల్లించాలి. ఇక ఏ వాహనానికైనా ఇన్సూరెన్స్ లేకపోతే 2000 రూపాయలు కట్టాలి. అంబులెన్సు వచ్చినప్పుడు దారి వదలకపోతే 10,000 రూపాయలు వాసులు చేస్తారు. డ్రైవింగ్ సామర్ధ్యం లేని వారు పట్టుపడితే 10,000 రూపాయలు చెల్లించుకోవలసిందే.

vehicle to minors welcomes jailఇక మైనర్ పిల్లలు వాహనం నడిపితే 25,000 రూపాయలు, మూడు నెలల జైలు వాహనదారుని లైసెన్స్ రద్దు చేస్తారు. కారుల్లో వెడుతూ సీట్ బెల్ట్ ధరించకపోతే 1000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. వాహన పరిమితి మించి ప్రయాణిస్తే 20, 000 రూపాయలు ముక్కు పిండి మరీ వాసులు చేస్తారు. క్రాస్ రోడ్స్ దగ్గర వున్న సిగ్నల్స్ పాటించకుండా జంప్ చేస్తే 500 రూపాయలు చెల్లించాల్చిందే. కాబట్టి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియం నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే …. జరిమానాతో పాటు … సమస్యలు తప్పవు.

Related posts