నిన్న కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. బుధవారం హైదరాబాద్ లో బంగారం ధరలు.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయలు పెరిగి 48,450 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,850 రూపాయలుగా నమోదు అయింది. వెండి ధర ఈరోజు భారీగా పెరిగింది. ఈరోజు వెండి ధర కేజీకి 1300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 62 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మాత్రం నిన్నటి ధర 53,350 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధర కేజీకి 1300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 62 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి.
previous post
ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్పింది చచ్చినట్లు వినండి : పూరి జగన్నాథ్