telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసులో మిస్టరీ గర్ల్… ఆమె ఎవరంటే ?

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురిని ఈడీ విచారించింది. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న జూన్ 14న ఓ యువతి ముఖానికి మాస్కుతో సుశాంత్ నివాసం వద్దకు వచ్చినట్టు కొన్ని వీడియోల్లో వెల్లడైంది. ఆ యువతి ఎవరన్నది తొలుత మిస్టరీగా మారింది. ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ యువతి ఎవరో ముంబయి పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమె పేరు జమీలా అని, ఆమె నటి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ గాళ్ ఫ్రెండ్ అని వివరించాయి. జమీలా, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని అతని నివాసానికి ప్రియాంక ఖేమాని, మహేశ్ శెట్టి అనే ఇతర స్నేహితులతో కలిసి వచ్చిందని, కానీ పోలీసులు అనుమతించకపోవడంతో సుశాంత్ ఇంటి పనివాళ్లతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయిందని చెప్పారు. కాగా ఇన్ స్టాగ్రామ్ లో సుశాంత్ తన ఇతర స్నేహితులతో కలిసివున్న ఫొటోలో జమీలా కూడా ఉంది.

Related posts