telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా పెళ్ళికి నలుగురే సెలెబ్రిటీలు… వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో పెళ్ళి…!

Rana

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద‌గ్గుబాటి హీరో రానా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ఇష్టసఖి మిహికా బాజాజ్‌ని పెళ్లాడబోతున్నారు రానా. వీరిద్దరి వివాహ మహోత్సవం ఆగ‌స్ట్ 8వ తేదీన వేద మంత్రాల నడుమ రామానాయుడు స్టూడియోస్‌లో జరగనుంది. ఇప్పటికే రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ఇళ్లలో ప్రీ-వెడ్డింగ్ సందడి మొదలైపోయింది. పెళ్లికి ముందు జరిగే తంతును ఇరువురి ఇళ్లలో వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కారణంగా ఈ పెళ్లికి ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజరు కానున్నారని రానా తండ్రి సురేష్ బాబు పేర్కొన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులతో కలిపి అంతా కేవలం 30 నుంచి 50 మంది మాత్రమే హాజరవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిలిం నగర్‌‌లో తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రానా- మిహికా పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం నలుగురు సెలబ్రిటీలు మాత్రమే అటెండ్ కానున్నారని తెలుస్తోంది. ఆ నలుగురే.. నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, శర్వానంద్ అని టాక్. నాగ చైతన్య, సమంత ఎలాగూ కుటుంబ పరంగా దగ్గరి బంధువులు.. అలాగే రామ్ చరణ్, శర్వానంద్‌లు ఇండస్ట్రీలో రానా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారికి మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. కాగా పెళ్లికి రాని ఇండ‌స్ట్రీలోని ఇత‌ర సెల‌బ్రిటీలు, స్నేహితుల కోసం రానా వర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నార‌ట‌. త‌ను ఎవ‌రినైతే పిల‌వాల‌ని అనుకున్నారో వారందరికీ ఈ టెక్నాల‌జీలో ఉప‌యోగించాల్సిన సామాగ్రిని కూడా పంపించారట రానా. ఈ వ‌ర్చువ‌ల్ రియాలిటీ ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగించడం ద్వారా వారికి కూడా పెళ్లిలో ఉన్న‌ ఫీలింగే కలుగుతుందట. అలా వీఆర్ టెక్నాల‌జీలో పెళ్లి చేసుకుంటున్న తొలి సెల‌బ్రిటీ రానానే కావ‌డం మరో విశేషం. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక సినీ ఇండస్ట్రీలోని అందరికీ గ్రాండ్‌గా పెళ్లి పార్టీ ఇవ్వనున్నారు రానా.

Related posts