telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఒక్కే రోజు మూడు భాషల్లో లవ్ స్టోరీ…

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. అయితే ఈ సినిమా నుండి సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగధరియా పాట మన టాలీవుడ్ లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసిన పాటగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరీ’ సినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఓవర్‌సీస్ హక్కులను ఇప్పటికే ఆరున్నర కోట్లకు విక్రయించారు. అయితే చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది.

Related posts