telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వి : మాయ చేస్తున్న “మనసు మరీ మత్తుగా” లిరికల్ సాంగ్

V

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘వి’.. సినిమా సినిమాకు జోనర్ మారుస్తూ హిట్ అందుకుంటున్న ఇంద్రగంటి.. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని నటిస్తున్న 25వ సినిమా ఇది. నివేధా థామస్, అదితిరావు హైదరీ ఫీమేల్ లీడ్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ నాని పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. అమిత్ త్రివేది ట్యూన్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందమైన పదాలు రాశారు. షాషా తిరుపతి, యాజిన్ నజీర్‌లతో కలిసి అమిత్ త్రివేది పాడారు. ‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ.. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా.. అంతగా కవ్విస్తావే గిల్లీ.. అందుకే బంధించెయ్ నన్నల్లి.. కిలాడి కోమలి గులేబకావళి.. సుఖాల జావలీ.. వినాలి కౌగిలీ’.. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ సింప్లీ సూపర్బ్.. భావాన్ని వ్యక్త పరిచేలా తన పదాలతో సిరివెన్నెల మరోసారి మనసు దోచారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘వి’ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయనున్నారు.

Related posts