మన దేశాన్ని ఏడాదికి పైగా వణికించిన కరోనా వైరస్ కు ఈ ఏడాది జనవరి నుండి టీకా ను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండోవ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో 60 ఏళ్లకు పైబడివారికి మాత్రమే టీకాను ఇస్తారు. అయితే ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్కినేని నాగార్జున కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు. నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ సినిమా నాగ్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది.
previous post