telugu navyamedia
సినిమా వార్తలు

సుస్మితా సేన్‌, లలిత్ మోదీ బ్రేకప్‌..మున్నాళ్ళ ముచ్చ‌టే..

ఐసీఎల్‌ ఫౌండర్ లలిత్ మోడీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ విడిపోయారనే వార్త జోరుగా చ‌క్క‌ర్లు కొడుతుంది. లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మార్పులు చూస్తే వీరిద్దరు బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే లలిత్ మోడీ.. సుస్మితా సేన్‌తో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా బెటర్ హాఫ్ తో డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే కొత్త జీవితం ప్రారంభమవుతుందని ట్వీట్‌ కూడా చేశారు.

Lalit Modi removes Sushmita Sen from Instagram bio, display picture; sparks  break-up rumours | Entertainment News,The Indian Express

అయితే, వయసులో చాలా తేడా ఉన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడటంపై అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఇద్దరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయిందట.

తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల, లలిత్ మోదీ తన ఇన్ స్టాగ్రామ్​లోప్రొఫైల్ నుంచి సుస్మిత పేరును తీసేశారు.. అంతేకాదు.. ఆమెతో కలిసి ఉన్న ఫొటోకు సంబంధించిన డీపీ కూడా మార్చేశారు.

Mangalore Today | Latest titbits of mangalore, udupi - Page Lalit-Modi- removes-Sushmita-Sen-from-Instagram-bio -display-picture-sparks-break-up-rumours

అందులో సుస్మిత ప్రస్తావన లేదు. ఆయన కొత్త బయోలో ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ అని మాత్రమే ఉంది. ఇన్​స్టా డీపీలో కూడా తన సోలో పిక్చర్‌ మాత్రమే పెట్టారు.

గతంలో సుస్మితతో కలిసి ఉన్నఫొటోలను షేర్ చేసిన లలిత్.. ఇలా సడన్‌గా డీపీ మార్చేయడంతో.. ఆమెతో బ్రేకప్ అయ్యిందంటున్నారు నెటిజన్లు.

Related posts