telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాఘవేంద్రరావు “పెళ్ళిసందడి”లో ఇతనే హీరో…?

Pelli-Sandadi

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యిందని, మ్యూజిక్ సెషన్స్‌ కూడా మొదలయ్యాయని తెలిపాడు. అయితే స్టార్‌ క్యాస్టింగ్‌ని మాత్రం రివీల్ చెయ్యలేదు. ఈ కొత్త ‘పెళ్లి సందడి’లో హీరో ఎవరు అనేదానికి ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్స్‌ వినిపిస్తున్నాయి. హీరో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ని హీరోగా తీసుకుంటాడేమో అని కామెంట్‌ చేస్తున్నారు. అప్పటి ‘పెళ్లి సందడి’లో తండ్రి హీరోగా చేశాడు కాబట్టి, ఇప్పటి ‘పెళ్లి సందడి’లో కొడుకు హీరోగా చేస్తే కంటిన్యుటీ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు జనాలు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు. ఆర్‌.కె.ఫిలింస్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్‌ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఇక రాఘవేంద్రరావు కమర్షియల్‌ మూవీస్‌ని పక్కనపెట్టి పదేళ్లు అవుతోంది. 2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ తర్వాత మళ్లీ కమర్షియల్‌ మూవీస్‌ తియ్యలేదు రాఘవేంద్రరావు. ‘శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ’ లాంటి భక్తి సినిమాలే చేశాడు. ఇప్పుడు “పెళ్ళి సందడి” రీమేక్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాఘవేంద్రరావు.

Related posts