telugu navyamedia
సినిమా వార్తలు

చౌదరి పేరు ఎందుకు లేదు???

తమ్మారెడ్డి బరద్వాజ్ గారు ఒక చక్కని మాట చెప్పారు. సినిమా వాళ్ళకు కులం ఉండదని, సినిమాలు తీసేటప్పుడు కులం చూడమని.. సరే మీ మాటకి మేము ఏకీభవించాలంటే మేము మీ సినిమా వాళ్ళు రెడ్ల పేరుని విలన్స్ కి పెట్టి ఎన్ని సినిమాలు తీసారో కోన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తాం.. అలాగే మీరు కూడా విలన్స్ కి చౌదరి అని ట్యాగ్ పెట్టి ఎన్ని సినిమాలు తీసారో చెప్పండి..

అల్లూ అర్జున్ :- ఆర్య-2 విలన్ పేరు రాజి రెడ్డి, రేసు గుర్రం విలన్ పేరు మద్దాలి శివా రెడ్డి, సరైనోడు విలన్ పేరు వైరం ధనుష్ రెడ్డి, పుష్పా విలన్ పేరు కోండా రెడ్డి

జూనియర్ ఎన్.టీ.ఆర్:- రభస విలన్ పేరు పెద్ది రెడ్డి – “ఆది, అరవింద సమేతా” ఫ్యాక్షన్ నేపధ్యం హీరో విలన్ ఇద్దరు రెడ్లే

రామ్‌ చ‌ర‌ణ్‌  :- రచ్చ మూవీలో విలన్ పేరు బైరెడ్డి

పవన్ కళ్యాణ్:- బంగారం మూవీలో విలన్ పేరు భూమి రెడ్డి, జల్సా విలన్ పేరు దామోదర్ రెడ్డి, వకీల్ సాబ్ లో నెగిటివ్ రోల్ శంకర్ రెడ్డి

రాణా:- కృష్ణం వందే జగద్గురుం విలన్ పేరు రెడ్డప్ప

రాం పోతినేని:- శివం సినిమాలో విలన్ పేరు భోజి రెడ్డి

ప్రభాస్:- బుజ్జిగాడు లో విలన్ పేరు మాచి రెడ్డి

గోపీచంద్:- రారాజు సినిమాలో విలన్ పేరు వెంకట రెడ్డి, వాంటెడ్ సినిమాలో విలన్ పేరు బసవా రెడ్డి, లౌక్యం సినిమాలో విలన్ పేరు కేశవ రెడ్డి

శర్వానంద్:- ప్రస్థానంలో నెగిటివ్ రోల్ లో బాసి రెడ్డి , ఎక్స్ ప్రెస్స్ రాజాలో కేశవరెడ్డి

నితిన్ :- సీతారాముల కల్యాణంలో విలన్ పేరు పెద్ది రెడ్డి

బాల కృష్ణ:- “ఫ్యాక్షన్ సినిమాలు తీసేస్తే” జై సింహా విలన్ పేరు రామి రెడ్డి , శ్రీమన్నారాయణ లో బైల్ రెడ్డి

రవితేజా:- క్రాక్ లో నెగిటివ్ రోల్ పేరు కోండా రెడ్డి

శ్రీ విష్ణు:- రాజ రాజ చోరా లో నెగిటివ్ రోల్ పేరు విలియం రెడ్డి

నారా రోహిత్:- బాలక్రిష్ణులు సినిమాలో విలన్ పేరు బసిరెడ్డి

కళ్యాణ్ రాం:- ఓం సినిమాలో విలన్ పేరు బైరెడ్డి , హరే రాం లో విలన్ పేరు శివా రెడ్డి

ఇవన్ని ఉదాహరణకు మాత్రమే చెప్పిన సినిమాలు ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తమ్మా రెడ్డి గారు కానీ ఇంకో సినిమా పెద్దగానీ గడించిన 15 ఏళ్ళలో ఒక్క సినిమాలో నైనా విలన్ పేరు వెనకాల చౌదరి అని పెట్టి సినిమా తీసారా ??

మీరు మా సినిమా వాళ్ళకి కులాలు లేవని చెప్పడం కాదు.. అది మీరు తీసే సినిమాల్లో కనపడాలి.. ఒక కులాన్ని గడించిన 10 , 15 ఏళ్ళుగా ఇలా టార్గెట్ చేసి విలన్స్ గా చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందో బయటికి వచ్చి చెప్పే దమ్ము మీ సినిమా పెద్దలకు ఉందా ??..

Related posts