సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం “మర్డర్”. వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభించింది. మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో సాగిన ఈ ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ శనివారం రిలీజ్ చేశాడు. రాము లేటెస్ట్ మూవీస్ అయిన ‘కరోనావైరస్’, ‘మర్డర్’ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ పుట్టిన రోజు వేళ రాము బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల ట్రైలర్లు రిలీజ్ చేశాడు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post